
ప్రేమికులరోజు కూడా వర్క్‌లో బిజీగా ఉందంటే సినిమా అంటే సమంతకు ఎంత పిచ్చి ప్రేమోనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత ప్రధాన పా
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత దానికి చికిత్స తీసుకుంటూనే మరోపక్క సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే! ఇటీవలే తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. ఇకపోతే వాలంటైన్స్ డే రోజు సమంత ఫ్రెండ్ ఆమెకు ఫ్లవర్స్ పంపించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించింది. తన స్నేహితురాలు ప్రియాంక దుగ్గిరాల ఈ పూలను పంపించిందని చెప్పుకొచ్చింది.
మరో పోస్ట్‌లో పంచ్ ఇస్తున్న స్టిల్‌ను పంచుకుంది సామ్. ఇందులో జిమ్ ట్రైనర్‌తో కలిసి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రేమికులరోజు కూడా వర్క్‌లో బిజీగా ఉందంటే సినిమా అంటే సమంతకు ఎంత పిచ్చి ప్రేమోనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండతో ఖుషి, వరుణ్ ధావన్‌తో సిటాడెల్‌లో నటిస్తోంది.
చదవండి: లవ్ టుడేకు వందకోట్లు