Yentamma Video Song: Salman Khan Movie Song Dance With Ram Charan And Venkatesh, Goes Viral - Sakshi
Sakshi News home page

Kisi Ka Bhai Kisi Ka Jan: రామ్ చరణ్, వెంకీ.. మధ్యలో సల్లు భాయ్.. ఊపేశారుగా!

Apr 4 2023 3:22 PM | Updated on Apr 4 2023 4:02 PM

Salman Khan Movie Song Dance with Ram Charan And Venkatesh - Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఏప్రిల్‌ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని 'ఏంటమ్మ.. ఏంటమ్మ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్​. అయితే ఈ సినిమా గ్లోబల్ స్టార్ చెర్రీ కూడా కనిపించడం ఆడియన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

సాధారణంగా లుంగీ డ్యాన్స్ అంటే ప్రేక్షకులకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమానే గుర్తుకొస్తుంది. అందులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే స్టెప్పులే గుర్తుకొస్తాయి. అయితే ఈ సాంగ్‌తో ఓ నయా ట్రెండ్​ సెట్​ చేశారు కిసీకా భాయి కిసీకీ జాన్​ టీమ్​. ఇందులో రామ్​ చరణ్​ స్పెషల్​​ పాటకు స్టెప్పులు వేయడం హైలెట్‌​గా నిలిచిందని అభిమానులు సంబరాలు చేసుకంటున్నారు. ప్రముఖ డ్యాన్స్​ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

(ఇది చదవండి: సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో 'బతుకమ్మ' పాట.. క్షణాల్లోనే వైరల్‌)

 ఆ సాంగ్‌లో రామ్ చరణ్, సల్లు భాయ్, వెంకటేశ్ కలిసి స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు డ్యాన్స్ చేయటం పట్ల రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు లెజెండ్స్ కలిసి డ్యాన్స్ చేయడం నా లైఫ్‌లో  ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ చెర్రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ముగ్గురు హీరోలు ఓకే పాటలో కనిపించడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తి పెరిగింది.
 
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా బతుకమ్మ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. 'ముంగిట్లో ముగ్గేసి గొబ్బిల్లే పెడ‌దామా...గ‌డ‌ప‌కు బొట్టేట్టి తోర‌ణాలు క‌ట్టేద్దామా' అంటూ హిందీ చిత్రంలో తెలుగు పాట రావడం తెలుగు ప్రేక్షకులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement