కమల్‌ హాసన్‌ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి | Sakshi
Sakshi News home page

Sai Pallavi: శివకార్తికేయన్‌కు జోడీగా సాయిపల్లవి

Published Mon, May 9 2022 9:23 PM

Sai Pallavi In Sivakarthikeyan 21, Meets Kamal Haasan - Sakshi

నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి బర్త్‌డే నేడు(మే 9). ఈ సందర్భంగా తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే గార్గి అనే కొత్త సినిమాకు సంబంధించి గ్లింప్స్‌ వీడియో షేర్‌ చేసింది సాయిపల్లవి. తాజాగా మరో మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. తమిళ స్టార్‌ శివకార్తికేయన్‌ 21వ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు వెల్లడించింది.

రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్నారు. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేసింది సాయిపల్లవి. 'ఈ సమావేశంలో కమల్‌ హాసన్‌ నుంచి ఉత్తమ నటిగా మారేందుకు అవసరమైన మెళకువలు నేర్చుకుంటాననుకున్నాను. కానీ, మంచి వ్యక్తిగా మారేందుకు అవసరమైన విలువలను తెలుసుకుని వెళ్లాను. నిజంగా ఈ మీటింగ్‌ నాకెంతో ప్రత్యేకం' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సినిమాను రాజ్‌కుమార్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌, సోనీ పిక్చర్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌, టర్మెరిక్‌ మీడియా సంయుక్తంగా నిర్మించనున్నాయి.

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి బర్త్‌డే స్పెషల్‌ ఫొటోలు ఇక్కడ చూడండి

చదవండి: పిచ్చి ముదిరింది, శూర్పణఖ అంటూ రెచ్చిపోయిన నటరాజ్‌

బికినీలో కేక్‌ కట్‌ చేసిన ఆమిర్‌ ఖాన్‌ కూతురు, ఫొటోలు వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement