సారంగదరియా, ఇది మామూలు క్రేజ్‌ కాదయా..

Sai Pallavi Saranga Dariya Crosses 200 Million Mark - Sakshi

యూట్యూబ్‌ను షేక్‌ చేసిన సాయిపల్లవి సాంగ్స్‌ అనగానే అప్పట్లో రౌడీ బేబీ, ఇప్పట్లో సారంగదరియా పాటలే గుర్తొస్తాయి. ఈ పాటల్లో మత్తుందో, సాయి పల్లవి స్టెప్పుల్లో కిక్కుందో తెలీదు గానీ ఇవి రెండూ సూపర్‌ డూపర్‌ హిట్టయ్యాయి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ల వ్యూస్‌ సాధించింది.

సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ముగ్ధ మనోహరంగా ఆలపించింది. తెలంగాణ జానపదానికి తోడు పవన్‌ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి 'అల వైకుంఠపురములో' చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది.

32 రోజుల్లో 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు ఏకంగా 200 మిలియన్ల వ్యూస్‌ మైలురాయిని అందుకుంది. ఈ సినిమా ఏప్రిల్‌ 16న రిలీజ్‌ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు.

చదవండి: మూడేళ్లలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి!

‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top