
ఈ రోజుల్లో చిన్న చిత్రాలు విజయవంతం కావడం అనేది సాధారణ విషయం కాదు. అలాంటిది 'రన్ బేబీ రన్' చిత్రం గత మూడవ తేదీన విడుదలై విజయవంతంగా నడుస్తూ రెండవ వారంలోకి అడుగుపెట్టింది. ఇంతకుముందు కార్తీ హీరోగా సర్దార్, శశికుమార్ కథానాయకుడిగా కారి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మింన ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్ లక్ష్మణన్ నిర్మించిన తాజా చిత్రం రన్ బేబీ రన్. ఆర్జే బాలాజి, నటి ఐశ్వర్యరాజేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ త్రానికి మలయాళ దర్శకుడు జియేన్ కృష్ణకువర్ కథ, కథనం బాధ్యతలను నిర్వహించారు.
ఇటీవల నిర్వహించిన ఈ చిత్ర థ్యాంక్స్ మీట్ సమావేశంలో నిర్మాత ఎస్.లక్ష్మణన్ మాట్లాడుతూ ఆర్జే బాలాజి హీరోగా తమ సంస్థలో మరో చిత్రం ఉంటుందని చెప్పారు. తాజాగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొంటూ రన్ బేబీ రన్ చిత్ర దర్శకుడు జియేన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నట్లు తెలిపారు. ఇది వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.
దీనికి సంబంధింన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ మను ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రం, ఆండ్రూస్ దర్శకత్వంలో మరో చిత్రం నిర్మిస్తోంది. వీటితో పాటు మరిన్ని మంచి కథా చిత్రాలు నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత ఎస్.లక్ష్మణన్ తెలిపారు.