
టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్‌టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రౌద్రం... రణం.. రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్)’. అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్.. కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ నటిస్తున్న..
టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్‌టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రౌద్రం... రణం.. రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్)’. అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్.. కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఫైనల్‌గా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఇప్పటికే విడుదలైన అల్లూరి, భీమ్ ఇంట్రడక్షన్ వీడియోలు రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కాగా ఈ మూవీ టీం సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. దానికి కోసం అక్టోబర్ 29 వరకు వేచి చూడాలని తెలిపింది. ట్విటర్‌లో మూవీ టీం పెట్టిన పోస్ట్‌లో.. ‘ఇది వరకెన్నడూ చూడని, వినని, ప్రపంచంలోనే ఇంతవరకు ఏ సినిమాకు లేని కలయికను చూసేందుకు సిద్ధం అవ్వండి. ఇలాంటిది విషయం మొదటిసారి కానుంది. ఇదే రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎక్జయిటింగ్ న్యూస్ మీకోసం ఎదురు చూస్తోంది’ అని తెలిపింది. ఆ సర్‌ప్రైజ్ గురించి తెలుసుకోవాలి అంటే మరో రెండు రోజు వెయిట్ చేయక తప్పదు.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రన్‌టైం ఎంతో తెలుసా?
Get ready to witness a never seen before and unheard collaboration for any film in the world on this October 29th. This is going to be one of it’s kind! 🤘🏻
— RRR Movie (@RRRMovie) October 27, 2021
Stay tuned for an exciting #RRRMovie update on the same day! 💥💥