RRR Update: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి బిగ్‌ సర్‌ప్రైజ్‌.. గెట్‌ రెడీ..

Madness in Few Hours Tweet By RRR Movie Makers Team - Sakshi

RRR Update: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌ ఉండగా.. దాన్ని మరింత పెంచే పనిలో పడినట్లుంది జక్కన్న టీం. రెండు రోజుల క్రితం అక్టోబర్‌ 29న ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనివిని ఎరుగనిది చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఈ మూవీ టీం ట్విట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు మరో అప్‌డేట్‌ ఇచ్చింది ఈ చిత్ర బృందం.

‘మ్యాడ్‌నెస్‌ ఇన్‌ ఫ్యూ అవర్స్‌’ అంటూ తాజాగా ట్వీట్‌ చేశారు మూవీ మేకర్స్‌. సిద్ధంగా ఉండండి  అంటూ చేసిన ఆ పోస్ట్‌లో ముంబైలోని అంధేరిలోని పీవీఆర్‌ సీటీ మాల్‌పై పుల్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పోస్టర్స్‌ ఉన్నాయి. దీంతో ఆ మూవీ నుంచి వచ్చే సర్‌ప్రైజ్‌ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తు​న్నారు.

చదవండి: న్యూ అప్‌డేట్‌.. అక్టోబ‌ర్ 29న రెడీగా ఉండండంటూ ట్వీట్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top