RRR First Day Collections: కలెక్షన్స్ సునామీ సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్... తొలిరోజే రికార్డు బద్దలు

RRR Movie First Day Collections World Wide: ఆర్‌ఆర్‌ఆర్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత శుక్రవారం(మార్చి25)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు నటించారు.
డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. భారీ తారాగణం, టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్‌కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్లలో సునామి సృష్టించింది.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఒక్క నైజాం ఏరియాలోనే కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో తొలి రోజున రూ.23.35 కోట్లు వసూలు చేసింది. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో సుమారు 120.19కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అలాగేఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 257.15 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా పవర్ మరోసారి చూపించింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
#RRRMovie creates HISTORY at the WW Box Office.
AP/TS - ₹ 120.19 cr
KA - ₹ 16.48 cr
TN - ₹ 12.73 cr
KL - ₹ 4.36 cr
ROI - ₹ 25.14 cr
OS - ₹ 78.25 cr [Reported Locs]Total - ₹ 257.15 cr
FIRST ever Indian movie to achieve this HUMONGOUS figure on the opening day.
— Manobala Vijayabalan (@ManobalaV) March 26, 2022
All-time Record Alert!#RRR 's Day 1 Share in Nizam is a new all-time record of ₹ 23.3 Crs..
Day 1 Telugu States gross must be more than ₹ 100 Crs..
— Ramesh Bala (@rameshlaus) March 26, 2022