Ranbir Kapoor Said He Does Not Feel Married Yet Alia Bhatt - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: పెళ్లి చేసుకున్నాం, మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్‌ ఏం లేదు

Jun 14 2022 11:20 AM | Updated on Jun 14 2022 12:32 PM

Ranbir Kapoor Said He Does Not Feel Married Yet Alia Bhatt - Sakshi

మా జీవితాల్లో పెద్దగా మార్పు ఏం కనిపించట్లేదు. ఐదేళ్లుగా కలిసుంటున్నాం, కాబట్టి ఇక పెళ్లి చేసుకుందామనుకున్నాం, చేసుకున్నాం. కానీ ఇప్పటికే సైన్‌ చేసిన ప్రాజెక్ట్‌లు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో మొదట వాటిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాం.

దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌- ఆలియా భట్‌ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే! ఏప్రిల్‌ 14న ఈ క్యూట్‌ కపుల్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే పెళ్లైన వెంటనే కొన్నాళ్లపాటు ఇద్దరూ సినిమాలకు బ్రేక్‌ చెప్పి టూర్లు చెక్కేస్తారనుకున్నారంతా! కానీ అనూహ్యంగా వారిద్దరూ పెళ్లైన రెండు రోజుల్లోనే తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. పెళ్లి తర్వాత లైఫ్‌ ఏమైనా మారిందా? అన్న ప్రశ్నకు తాజాగా రణ్‌బీర్‌ ఇలా స్పందించాడు.

'మా జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించట్లేదు. ఐదేళ్లుగా కలిసుంటున్నాం, కాబట్టి ఇక పెళ్లి చేసుకుందామనుకున్నాం, చేసుకున్నాం. కానీ ఇప్పటికే సైన్‌ చేసిన ప్రాజెక్ట్‌లు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో మొదట వాటిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాం. పెళ్లైన తర్వాతి రోజే మేం షూటింగ్స్‌తో బిజీ అయ్యాం. అలియా తన మూవీ షూటింగ్‌లో నేను మనాలీలో నా సినిమా షూటింగ్‌లో ఉండిపోయాం. అలియా తన హాలీవుడ్‌ మూవీ షూటింగ్‌ ముగించుకుని లండన్‌ నుంచి ఎప్పుడైతే తిరిగొస్తుందో అప్పుడు మేము కొంత బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నాం. అది కూడా నేను నటించిన షంషేరా మూవీ రిలీజయ్యాకే ఏదైనా హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తాం. ప్రస్తుతానికైతే మాకింకా పెళ్లి కానట్లే అనిపిస్తోంది' అని చెప్పుకొచ్చాడు రణ్‌బీర్‌. కాగా షంషేరా జూలై 22న రిలీజ్‌ కానుండగా రణ్‌బీర్‌ దంపతులు నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది.

చదవండి: లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో!
డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీగా ఉన్నారు, అదే సంతోషం: వరుణ్‌ తేజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement