SS Rajamouli RRR: లాస్‌ఎంజిల్స్‌ థియేటర్‌లో రాజమౌళి సందడి.. వన్‌ అండ్ ఓన్లీ అంటూ రామ్ చరణ్ ట్వీట్

Ram Charan Tej Tweet Goes Viral On RRR Director SS Rajam - Sakshi

'ఆర్ఆర్ఆర్' అంటే తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సాధించిన మూవీ. ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళిని మరోస్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ఈ మూవీని అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో బిగ్‌ స‍్క‍్రీన్‌పై ఎంజాయ్ చేశారు రాజమౌళి. ఫారిన్ ఆడియన్స్‌తో కలిసి వీక్షించిన ఆయన థియేటర్లో సందడి చేశారు. తాజాగా ఆ వీడియోను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'వన్‌ అండ్ ఓన్లీ.. ఎస్ఎస్ రాజమౌళి' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.  దీంతో జక్కన్న పేరు మరోసారి ప్రపంచవ‍్యాప్తంగా మార‍్మోగిపోయింది. 

లాస్ ఎంజిల్స్‌లోని థియేటర్‌లో సినిమాను వీక్షిస్తున్న ఫారిన్ ఆడియన్స్‌ డ్యాన్స్‌తో హోరెత‍్తించారు. నాటు నాటు పాటకు స్టెప్పులతో అదరగొట్టారు. అభిమానుల కోలాహలంతో థియేటర్ మార్మోగిపోయింది.  ఫ్యాన్స్ డ్యాన్స్  చేస్తున్న వీడియోను లాస్ ఏంజిల్స్ టైమ్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ సాంగ్‌కు విదేశీయులు డ్యాన్స్ చేయడాన్ని చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top