
రామ్‌చరణ్ షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి వేకేషన్ మోడ్‌లోకి వెళ్లారు. శంకర్ దర్వకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌తో పాటు రామ్‌చరణ్– అంజలి కాంబినేషన్‌లోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం.
రాజమండ్రి షూటింగ్‌ను పూర్తి చేసుకుని, హైదరాబాద్ వచ్చిన ఆయన స్మాల్ బ్రేక్ తీసుకుని, ఫ్యామిలీతో కలిసి వేకేషన్‌ను ప్లాన్ చేశారు. ‘రెండేళ్ల తర్వాత రామ్ చరణ్‌తో వెకేషన్‌కి వెళుతున్నాను’ అంటూ ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా రామ్‌చరణ్–శంకర్ సినిమాని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్ర యూనిట్.
Finally a vacation after 2 years !
— Upasana Konidela (@upasanakonidela) March 6, 2022
Thank u Mr C ♥️♥️🤗🤗@AlwaysRamCharan pic.twitter.com/AbLXU74OcG