రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా ‘విక్రమ్‌’ తెలుగు ట్రైలర్‌ | Ram Charan As Chief Guest To Kamal Haasan Vikram Telugu Trailer Event | Sakshi
Sakshi News home page

Ram Charan: రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా ‘విక్రమ్‌’ తెలుగు ట్రైలర్‌

Published Fri, May 20 2022 2:25 PM | Last Updated on Fri, May 20 2022 3:30 PM

Ram Charan As Chief Guest To Kamal Haasan Vikram Telugu Trailer Event - Sakshi

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్‌. లోకేష్‌ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో నితిన్‌ రిలీజ్‌ చేయబోతోన్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్‌ శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంలో నితిన్‌ ‘విక్రమ్‌’ సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు(మే 20) సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ విడుదలకు ముహుర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

ఆన్‌లైన్‌ వేదికగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.  పొలిటికల్‌ యాక్షన్‌ థ్లిల్లర్‌గా సాగే ఈ మూవీలో తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, మలయాళీ పాపులర్‌ యాక్టర్‌ ఫహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందించారు. జూన్‌ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement