Allu Arjun Pushpa Movie Trailer Delayed Due To Technical Issue - Sakshi
Sakshi News home page

Pushpa Movie Trailer: పుష్ప ట్రైలర్‌ వాయిదా.. అభిమానులకు పుష్ప టీం క్షమాపణలు

Dec 6 2021 6:14 PM | Updated on Dec 6 2021 10:40 PM

Pushpa Movie Team Announced Trailer Delayed Due To Technical Issue - Sakshi

చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నామని, ఆటంకానికి చింతిస్తున్నామంటూ అభిమానులను చిత్ర బృందం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. డిసెంబర్‌ 17న పుష్ప ది రైజ్‌ పేరుతో ఫస్ట్‌ పార్ట్‌ విడుదల కాబోతోన్న నేపథ్యంలో డిసెంబర్‌ 6(సోమవారం) సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

చదవండి: సమంత మరో పాన్‌ ఇండియా చిత్రం టైటిల్ ఇదే, డైరెక్టర్లు ఎవరంటే..

దీంతో అభిమానుల, ప్రేక్షకులు అంతా ట్రైలర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంగా పుష్ప టీం అనుకొకుండా షాకిచ్చింది. ట్రైలర్‌ను ఈ సమయానికి విడుదల చేయలేకపోతున్నామంటూ ట్విట్‌ చేసి ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. సాంకేతిక సమస్యల కారణంగా ట్రైలర్‌ను ముందుగా చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నామని, ఆటంకానికి చింతిస్తున్నామంటూ అభిమానులను చిత్ర బృందం క్షమాపణలు కోరింది. త్వరలోనే దీనిపై అప్‌డేట్‌ ఇస్తామని అప్పటివరకు వేచి చూడాలంటూ పుష్ప టీం సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement