Priyanka Chopra Roasts Her Husband Nick Jonas In Show Video Goes Viral - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: నిక్‌ జొనాస్‌పై ప్రియాంక వీడియో.. రూమర్స్‌కు చెక్‌

Nov 24 2021 6:13 PM | Updated on Nov 24 2021 8:04 PM

Priyanka Chopra New Video On Her Husband Nick Jonas - Sakshi

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా వచ‍్చిన వార్త షికారు కొట్టిన సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఈ వార్తపై తెగ చర్చ జరిగింది. ఇందుకు కారణం ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌ ఫ్రొఫైల్‌లో నిక్ జోనాస్‌ పేరు తొలగించడమే. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్‌ అవాక్కయ‍్యారు. ప్రియాంక కూడా నటి సమంతలా విడాకులు తీసుకోబోతుందా అని గుసగుసలు వినిపించాయి. దీంతో ఈ వార్తలను ఖండించింది ప్రియాంక తల్లి మధు చోప్రా. అవన్ని వట్టి పుకార్లే అని స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టింది ప్రియాంక.   

ఇదీ చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది?

తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. ఆ వీడియోలో నిక్‌ జొనాస్‌ను తన కామెంట‍్లతో ఓ ఆట ఆడేసుకుంది. నిక్ జొనాస్‌కు, ఆయన సోదరుల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ తనకే ఉ‍న్నారని తెలిపింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జరిగిన జొనాస్‌ బ్రదర్స్‌ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్‌ కుటుంబం పాల్గొంది. ఈ షోకి జొనాస్‌ బ‍్రదర్స్‌తోపాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్‌ కెనన్‌ థాంప్సన్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. 

ఇదీ చదవండి: కూతురి విడాకుల వార్తలపై మధు చోప్రా స్పందన
'నేను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను. నా కంటే 10 ఏళ‍్లు చిన్నవాడు నిక్‌. మేమిద్దరం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. నాకు టిక్‌టాక్ ఎలా ఉపయోగించాలో నిక్‌ నేర్పితే, సక్సెస్‌ఫుల్‌ యాక్టింగ్‌  కెరీర్‌ ఎలా ఉంటుందో నేను చూపించాను. నాకు నిక్‌పై చాలా ప్రేమ ఉంది. నా జీవితాన్ని అతను పూర‍్తిగా మార్చేశాడు. జొనాస్‌ బ్రదర్స్‌కు పిల్లలున్నారు. మాది మాత్రమే పిల్లలు లేని జంట. కానీ ఇవాళ అందరిముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి, రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం. ఈ షోలో జొనాస్‌ బ్రదర్స్‌ను రోస్ట్‌ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది'. అని ప్రియాంక చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement