
‘సలార్’ యూనిట్ ప్రస్తుతం నైట్ మోడ్‌లో ఉంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 28న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది.
దీంతో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని ‘సలార్’ టీమ్ షూటింగ్ షెడ్యూల్స్‌ని పక్కాగా ప్లాన్ చేసి, గ్యాప్ రాకుండా చూసుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నైట్ షూట్ జరుపుతున్నారు. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.