Ponniyin Selvan Movie Collections: ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే

Ponniyin Selvan Box Office Collection Day 1: Film Earns Rs 25.86cr In Tamil Nadu - Sakshi

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి భాగం శుక్రవారం(సెప్టెంబర్‌ 30న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. చియాన్‌ విక్రమ్‌, హీరో కార్తీ, ఐశ్వర్యరాయ్‌, ‘జయం’ రవి, త్రిష, ప్రకాశ్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌ వంటి తదితర భారీ తారాగణంతో రూపొందిన  ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకోగా.. తమిళనాట భారీ వసూళ్లు చేసినట్లు ట్రెడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో తొలి రోజు రికార్ట్‌ కలెక్షన్స్‌ చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

చదవండి: పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్‌, భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షలు చెల్లించాలి

పొన్నియన్ సెల్వన్ మొదటి రోజు కలెక్షన్స్.. ఈ ఏడాది కోలీవుడ్ బెస్ట్ ఓపెనింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. మొదటి రోజు రూ. 25.86 కోట్లు గ్రాస్ వసూల్ చేసి.. ఈ ఏడాది వలిమై రూ. 36.17 కోట్లు, బీస్ట్ రూ. 26.40 కోట్లు తర్వాత మూడో స్థానంలో పొన్నియన్ సెల్వన్ నిలిచింది. కేవలం తమిళంలోనే పొన్నియన్ సెల్వన్ రూ. 25.86 కోట్లు రాబడితే.. వరల్డ్ వైడ్ మంచి నెంబర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నాయి ట్రెడ్‌ వర్గాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ టాక్‌ ఎలా ఉన్నప్పటికీ సాయంత్రం, నైట్‌ షోలకు హౌజ్‌ఫుల్‌ కలెక్షన్స్‌ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన తెలుగులో కూడా పొన్నియన్‌ సెల్వన్‌ బాగానే కలెక్షన్స్‌ చేసిందంటున్నారు. అలాగే బి-టౌన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం సుమారు రూ. 1.75 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని సమాచారం. 

చదవండి: పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top