టాక్ ఏమో అలా.. 'భైరవకోన' కలెక్షన్స్ మాత్రం కళ్లు చెదిరేలా! | Sakshi
Sakshi News home page

Ooru Peru Bhairavakona: 'ఊరిపేరు భైరవకోన'కి రెండు రోజుల్లోనే అన్ని కోట్ల వసూళ్లు

Published Sun, Feb 18 2024 3:00 PM

Ooru Peru Bhairavakona Movie Day 2 Worldwide Collection - Sakshi

ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలేం లేవు. ఈ శుక్రవారం రిలీజైన 'ఊరిపేరు భైరవకోన' చిత్రానికి తొలుత యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో వసూళ్లు ఏముంటాయిలే అని అందరూ అనుకున్నారు. కానీ టాక్‌తో సంబంధం లేకుండా కళ్లు చెదిరే కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీకి వస్తున్న వసూళ్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

(ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి దాదాపు నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో 'హనుమాన్' హిట్ టాక్‌తోపాటు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. 'గుంటూరు కారం', 'నా సామి రంగ' పాసైపోయాయి. 'సైంధవ్'కి పెద్ద దెబ్బ పడింది. గతవారం రవితేజ 'ఈగల్' వచ్చింది కానీ రెండు మూడు రోజుల్లోనే సైలెంట్ అయిపోయింది.

ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఊరిపేరు భైరవకోన' చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ పెద్దగా ఏం ఉండవులే అని అందరూ అనుకున్నారు. కానీ తొలిరోజు రూ.6.03 కోట్లు రాగా.. రెండో రోజు ఏకంగా రూ 7 కోట్లు వరకు వచ్చాయి. తద్వారా రెండు రోజుల్లో రూ.13.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్ వరకు ఈ జోష్ కొనసాగేలా ఉంది. సోమవారం నుంచి ఏం జరుగుతుందనేది మాత్రం చూడాలి.

(ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు)

Advertisement
 
Advertisement
 
Advertisement