ఈ రోజు నా కల నెరవేరింది: హీరోయిన్‌

Niti Taylor Special Gift To Husband On 2nd Month Wedding Anniversary - Sakshi

ముంబై: కొత్త పెళ్లికూతురు, నటి నీతి టేలర్‌ తన భర్త పరీక్షిత్‌ భవాకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చారు. వివాహం జరిగి రెండు నెలలు పూర్తైన సందర్భంగా  తన శ్రీవారి పేరును వేలిపై పచ్చబొట్టు వేయించుకుని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన నీతి.. తన కల నెరవేరిందంటూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ఉంగరపు వేలిపై నా భర్త పేరును పచ్చబొట్టు వేయించుకోవాలని మా పెళ్లైన రోజునే నిశ్చయించుకున్నాను. నేడు నా కోరిక తీరింది. కల నెరవేరింది.

నా చిన్ని వేలిపై ఈ పెద్ద పేరును టాటూగా వేయించుకోవడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. నాలో సగభాగమైన నా భర్తకు నేనిచ్చిన బహుమతులు ఇవే. ఈ చిన్ని కేకుతో పాటు మరెన్నో సెలబ్రేషన్స్‌’’ అంటూ జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్నారు. కాగా ‘మేము వయసుకు వచ్చాం’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైన నీతి టేలర్‌, ఆ తర్వాత రాహుల్‌ రవీంద్రన్‌తో కలిసి పెళ్లి పుస్తకం అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అనంతరం టెలివిజన్‌ స్టార్‌గా మారి బుల్లితెరపై కూడా సందడి చేశారు. ఇష్క్‌బాజ్‌, గులాల్‌ వంటి హిట్‌ హిందీ సీరియళ్లలో నటించారు.ఇక తన చిరకాల మిత్రుడు పరిక్షిత్‌ భవాతో గతేడాది ఆగష్టులో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఈ ఏడాది ఆగష్టు 13న అతడిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.(చదవండి: తల్లి కాబోతున్న ‘అతిథి’ హీరోయిన్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top