Niharika Konidela : భర్తతో నిహారిక రొమాంటిక్‌ ఫోటో వైరల్‌

Niharika Konidela Liplock Photo With Hubby Chaitanya Goes Viral - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన నిహారిక ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న నిహారిక పేరు మరోసారి హాట్‌టిపిక్‌గా మారింది. భర్తతో నిహారిక లిప్‌లాక్‌ ఫోటో ఒకటి బయటికొచ్చింది. విడిపోని బంధం అంటూ నిహారిక భర్తతో దిగిన రొమాంటిక్‌ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.


గత కొంతకాలంగా నిహారిక పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించి రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్‌ పెట్టేందుకే నిహారిక ఇలాంటి ఫోటోతో సమాధానమిచ్చిందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. ఇంత బోల్డ్‌ అవసరమా అంటూ మరికొందరు ట్రోల్‌ చేస్తున్నారు. నిజానికి ఈ ఫోటోను నిహారిక షేర్‌ చేయలేదు. అంతేకాకుండా ఇది లేటెస్ట్‌ పిక్‌ కూడా కాదు. నిహారిక కొణిదెల పేరుతో ఎవరో ఓ అకౌంట్‌ను క్రియేట్‌ చేసి ఈ బోల్డ్‌ పిక్‌ను షేర్‌ చేశారు. కాసేపట్లో ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top