
కొన్ని రోజులుగా సినిమా అభిమనులను నెట్‌ఫ్లిక్స్ ఊరిస్తూ బంపర్ ఆఫర్ అంటూ ప్రచారం చేస్తున సంగతి తెలిసిందే. సినిమా ప్రేమికుల ఎదురుచూపులకు తెరదించతూ రెండు రోజుల ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించింది. స్ట్రీమ్ ఫెస్ట్‌లో భాగంగా భారత దేశమంతటా నేడు, రేపు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ రెండు రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ లో ఉచితంగా వీడియోలను వీక్షించవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 5 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఆఫర్‌ను మొదటగా మనదేశంలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో ఇటువంటి ఆఫర్ పెట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటున‍్న నెట్‌ఫ్లిక్స్ యూజర్లు తమ ఆనందాలను ట్విట్టర్ వేదికగా రకరకాల మీమ్స్ పెడుతూ నలుగురితో పంచుకుంటున్నారు.