టాలీవుడ్ డైరెక్టర్ మృతి.. మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ | Nenu Meeku Telusa Movie Director Ajay Sastry Passed Away, Manchu Manoj Emotional Tweet Inside | Sakshi
Sakshi News home page

Director Ajay Sastry Death: చిన్న వయసులోనే తెలుగు దర్శకుడు కన్నుమూత

Aug 2 2024 1:33 PM | Updated on Aug 2 2024 1:49 PM

Nenu Meeku Telusa Movie Director Ajay Sastry Passed Away

తెలుగు ఇండస్ట్రీలో విషాదం. హీరో మంచు మనోజ్‌తో అప్పట్లో 'నేను మీకు తెలుసా?' సినిమా తీసిన దర్శకుడు అజయ్ శాస్త్రి (50) కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన మనోజ్.. చాలా ఎమోషనల్ అయ్యాడు. తన బాధని బయటకు చెప్పుకోలేకపోతున్నానని రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'తిరగబడర సామీ' సినిమా రివ్యూ)

'కెప్టెన్ ఆఫ్ 'నేను మీకు తెలుసా', నా బెస్ట్ ఫ్రెండ్ ఇక లేరు. ఈ బాధని చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. ఆ పరమశివుడే.. అతడి కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి. మిస్ యూ రా అజయ్. త్వరగా వెళ్లిపోయావ్. లవ్ యూ రా బాబాయ్' అని మనోజ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అజయ్ శాస్త్రి.. డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన 'రాఖీ', 'డేంజర్' చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. 2008లో 'నేను మీకు తెలుసా?' మూవీతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా ఫెయిల్ కావడంతో మరో ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత ఏమైపోయారో ఎక్కడున్నారనే విషయాలు బయటకు రాలేదు. ఇప్పుడు మనోజ్ ట్వీట్‪‌తో అజయ్ చనిపోయిన విషయం బయటపడింది.

(ఇదీ చదవండి: చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్‌నే బెస్ట్: కీర్తి సురేశ్‌)

Advertisement
 
Advertisement
Advertisement