‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’ | Sakshi
Sakshi News home page

‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’

Published Wed, Aug 26 2020 8:41 AM

Neena Gupta Advice: Focus On Work Not On Men - Sakshi

ముంబై : నటి నీనా గుప్తా పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియా ట్రెండ్‌ అవుతున్నారు. నేహా ధుపియా నిర్వహిస్తున్న టెలివిజన్‌ ‘నో ఫిల్టర్‌ నేహా’ షోలో ఇటీవల నీనా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఒకవేళ మీరు యుక్త వయస్సులో ఉంటే మీకు మీరు ఇచ్చుకునే సలహా ఏంటని నేహా ప్రశ్నించగా... దీనిపై స్పందించిన నీనా ‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’ అంటూ సమాధానమిచ్చారు. అయితే నీనా ఇలా చెప్పడం మొదటి సారి కాదు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని తరచూ అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. యువత సరైన దారిలో ఎలా నడుచుకోవాలో కూడా సందేశాలు ఇస్తూ ఉంటారు. (వివాహితుడిని ప్రేమించకండి: నటి)

కాగా నేహా ధూపియా షో ఐదో సీజన్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో నీనా గుప్తాతోపాటు, రానా దగ్గుబాటి, కపిల్‌ దేవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సైఫ్‌ అలీఖాన్‌,  సోనూసూద్‌, అదితి రావ్‌ వంటి ప్రముఖులను కూడా ఇంటర్య్వూ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ షో ఆగస్ట్‌ 28న ప్రారంభం కాబోతుంది. (విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..)

వెస్టిండీస్‌ క్రికెటర్‌, వివాహితుడైన వివియన్‌ రిచర్డ్స్‌ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు.  ఆమే ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా. కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్‌ రిచర్డ్స్‌, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా వేరే వ్యక్తినిపెళ్లి చేసుకున్నారు. బదా యీ హో, సర్వమంగళ్‌ జ్యాదా సావధాన్‌ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించిన ఆమె బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement