Krishna Vrinda Vihari 2nd Day Collections: రెండో రోజు కలెక్షన్లతో అదరగొట్టిన 'కృష్ణ వ్రింద విహారి'

యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టిందీ చిత్రం.
అయితే తాజాగా తొలిరోజు కంటే రెండోరోజు ఎక్కువ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ లక్షడాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా నాగశౌర్య ఇందులో సంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించాడు.బ్రహ్మాజీ, సత్య మరియు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లొ నటించారు.
Thanks to all the Overseas Audience for the Immense LOVE for our #KrishnaVrindaVihari 😊✨
$100k+ US Gross in 2 Days! ❤️🔥
Watch our #HilariousBlockbuster In Cinemas now!
🎟️ https://t.co/ZN7BGCyB6k#KVV @ShirleySetia #AnishKrishna @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/tHMigqo57b— Naga Shaurya (@IamNagashaurya) September 25, 2022
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు