ఇది నిజమేనా? లెటజ్‌ వెయిట్‌ అండ్‌ సీ!

Mahesh Babu Next Movie With New Director - Sakshi

మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌ లో హీరోగా మహేశ్‌బాబు ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందు మరో సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్‌బాబు. ఈ సినిమా దర్శకుల పేర్లలో అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి వంటివారి పేర్లు వినిపించాయి.

తాజాగా ఓ నూతన దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌ మహేశ్‌కు నచ్చిందట. ఫుల్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పారట మహేశ్‌. అంతేకాదు... ఈ సినిమాను కేవలం రెండు నెలల్లో పూర్తి చేయాలనే షరతు కూడా ఆ దర్శకుడికి  పెట్టారట మహేశ్‌. మరి.. ఇది నిజమేనా? లెటజ్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే శనివారంతో ఫేస్‌బుక్‌లో మహేశ్‌ ఫాలోయర్ల సంఖ్య 14 మిలియన్స్‌ (ఒక కోటీ నలభై లక్షలు)కు చేరింది. ఈ సందర్భంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: 
కన్నడ హీరోతో పూరి జగన్నాథ్‌ కొత్త సినిమా!‌
ఈ హీరోయిన్‌ నిజ జీవితంలోనూ ఓ సివంగి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top