'లెట్స్‌ డ్యూ ఇట్‌' అంటున్న మహేశ్‌ బాబు.. ఎందుకో తెలుసా ? | Mahesh Babu Is New Brand Ambassador For Mountain Dew | Sakshi
Sakshi News home page

Mahesh Babu: 'లెట్స్‌ డ్యూ ఇట్‌' అంటున్న మహేశ్‌ బాబు.. ఎందుకో తెలుసా ?

Dec 3 2021 4:43 PM | Updated on Dec 3 2021 4:48 PM

Mahesh Babu Is New Brand Ambassador For Mountain Dew - Sakshi

Mahesh Babu Is New Brand Ambassador For Mountain Dew: సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబుకు తెలుగు సినీ  ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్న 'టక్కరి దొంగ'. అభిమానుల గుండెల్లో 'రాజ కుమారుడి'లా కుర్చీ వేసుకున్న 'ఒక్కడు'. అందం, అభినయం, క్రమశిక్షణలో 'శ్రీమంతుడు'. పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా  నిలిచిన 'మహార్షి'. ఎంత స్టార్‌డమ్‌ ఉన్నప్పటికీ ఎంతో ఒద్దికగా, దురుసుగా ప్రవర్తించకుండా డౌన్‌ టు ఎర్త్‌ ఉంటారు. అందుకే ఆయన్ను 'సరిలేరు మీకెవ్వరూ' అని అభిమానులు గుండెల్లో గూడు కట్టుకుంటారు. కొత్త సినిమాలతో అభిమానులను ఎప్పుడూ అలరిస్తుంటారు. 

అలాగే జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటారు సూపర్ స్టార్‌. కేవలం సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా టాప్‌ ఉంటారు మహేశ్‌. ఇదీవరకు ఆయన థంప్స్‌అప్‌, అభి బస్‌, ఐడియా, సంతూర్‌, ప్యారగాన్ తదితర వాణిజ్య ప‍్రకటనల్లో నటించారు. తాజాగా శీతలపానీయమైన 'మౌంటేన్ డ్యూ' ఇండియాకు కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు మహేశ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో 'లెట్స్‌ డ్యూ ఇట్‌' అంటూ పోస్ట్ చేశారు. ఇటీవల ఆయన మోకాలికి శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారని తెలిసిందే. 

ఇది చదవండి: సర్జరీ కోసం అమెరికా వెళ్తున్న మహేశ్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement