మహేశ్‌ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫోటో వైరల్‌ | Mahesh Babu Look As A Lord Ram, Idol Pic Goes Viral | Sakshi
Sakshi News home page

ఏపీలో మహేశ్‌ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. నిజమేనా?

Mar 27 2026 2:47 PM | Updated on Mar 27 2026 3:08 PM

Mahesh Babu Look As A Lord Ram, Idol Pic Goes Viral

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ గుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ప్రత్యేకత ఏంటంటే.. ఆ విగ్రహం అచ్చం మహేశ్‌ బాబులాగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో ఆ రాముడి విగ్రహం ఉందని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

ఏఐ ఫోటో?
అయితే  సదరు నెటిజన్‌ ఆ విగ్రహం ఉన్న గుడి పేరు చెప్పకుండా  ‘15 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎక్కడో గుడిలోని రాముడు.. అచ్చం మహేశ్‌ బాబులాగే కనిపిస్తున్నాడు’ కదా అని పోస్ట్‌ పెట్టడంతో.. అది నిజమైన విగ్రహం కాదేమో అని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఉంటే.. ఈ పాటికే అందరికి తెలిసిపోయేది కదా? అని కామెంట్‌ చేస్తున్నారు. కేవలం వ్యూస్‌, రీచ్‌ కోసమే ఇలాంటి ఏఐ ఫోటోలను షేర్‌ చేస్తున్నారంటూ కొంతమంది నెటిజన్స్‌ మండిపడుతున్నారు. మహేశ్‌ అభిమానులు అయితే.. శ్రీరాముడిగా కనిపిస్తున్న తమ హీరోని చూసుకొని మురిసిపోతున్నారు.

రాముడిగా మహేశ్‌?
మహేశ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూ. 1000 కోట్ల బడ్జెట్‌ లో హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్‌..రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పాడు. మహేశ్‌ బాబును పోలిన రాముడి విగ్రహం వైరల్‌ కావడానికి అది కూడా ఒక కారణం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement