మహేశ్‌ చేతుల మీదుగా ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ మోషన్‌ పోస్టర్‌

Mahesh Babu Launches Motion Poster Of Thanku Brother - Sakshi

‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్, అశ్విన్‌ విరాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. ఈ సినిమాతో రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు. జస్ట్‌ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విడుదల చేశారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ అంతా భ‌యంక‌ర‌మైన శ‌బ్ధాల‌తో ఉండ‌గా, నెలలు నిండిన గర్భవతిగా అన‌సూయ‌, అశ్విన్ లిఫ్ట్‌లో ఇరుక్కొని భ‌యంతో చూస్తున్నారు.లిఫ్ట్ మధ్యలో స్ట్రక్ అయినట్టు.. సాయం కోసం అభి అరుస్తున్నట్టు మోషన్ పోస్టర్‌లో చూపించారు. అనసూయ ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్టు రివీల్ చేశారు. ఇంతకి లిఫ్ట్ లో అనసూయ ఎందుకు ఇరుక్కుంది. అసలేం జరిగిందనేది తెలియాలంటే ‘థ్యాంక్యూ బ్రదర్‌’ సినిమా చూడాల్సిందే. ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామ్‌ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top