
సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ఓ త్రిబుల్ ధమాకా వార్త. ఆయన బర్త్‌డే సందర్భంగా మూడు అదరిపోయే అప్‌డేట్స్ రానున్నాయి. ఆగస్ట్ 9న ఉదయం 9 గంటలకు ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’పేరుతో మహేశ్ కొత్త సినిమా అప్‌డేట్ ఇవ్వబోతున్నారు. అలాగే ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’చిత్రం నుంచి ఉదయం 12 గంటలకు పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.
మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’నుంచి కూడా ఒక అప్‌డేట్ రానుంది. మొత్తంగా ఒకే రోజు తమ అభిమాన హీరో సినిమా నుంచి మూడు అప్‌డేట్స్ వస్తుండడంతో మహేశ్ ప్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.