
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడు లేనంతగా ఈ సారి అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. సాధారణ ఎన్నికల మాదిరి బహిరంగ విమర్శలు కూడా చేసుకుంటున్నారు.
(చదవండి: ‘ఆచార్య’ అదిరిపోయే వీడియో.. చెర్రీ ఎమోషనల్ పోస్ట్)
ఇదిలా ఉంటే నేడు(ఆగస్ట్ 22) ‘మా’కార్యవర్గం సమావేశం కానుంది. వర్చువల్ పద్దతిలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇందులో రెండేళ్లలోని జమ ఖర్చులు, మా సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు, మా ఎన్నికల నిర్వహణ పై చర్చ నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మా ఎన్నికల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.