
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో వంటి సినిమాలతో ఆయన పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రజినీకాంత్‌తో 'కూలీ' తీస్తున్నాడు. అయితే, కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక వేదికపై మాట్లాడుతూ.. లోకేశ్పై తనకు కోపం ఉందని, లియో సినిమాలో పెద్ద పాత్ర ఇవ్వలేదన్నాడు. తన సమయాన్ని వృథా చేశాడని సరదాగా నవ్వుతూ అన్నాడు. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో లోకేశ్ స్పందించారు.
సంజయ్ దత్ వ్యాఖ్యలపై లోకేశ్ కనగరాజ్ ఇలా అన్నారు. ' సంజయ్ సార్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. "నేను ఫన్నీగా కామెంట్ చేశాను, కానీ సోషల్ మీడియాలో మరో రకంగా ఈ వ్యాఖ్యలు వెళ్లాయి. తర్వాత ఇబ్బందిగా అనిపించింది" అని అన్నాడు. అప్పుడు నేను కూడా పర్వాలేదు సార్ ఇలాంటివి సహజమేనని చెప్పాను. నేను గొప్ప ఫిల్మ్ మేకర్ని కాదు, ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నాను. భవిష్యత్తులో సంజయ్ దత్‌కు అత్యుత్తమమైన పాత్రను రెడీ చేస్తాను. మరో సినిమాతో తప్పు సరిదిద్దుకుంటాను.' అని లోకేశ్ అన్నారు.
Q: SanjayDutt said that you wasted him in #LEO❓#Lokesh: SanjayDutt called me & said "I commented funny, but it felt awkward after social media comments". I'm not a greatest filmmaker, it's all learning. Hopefully I will make best out of him in future😀 pic.twitter.com/GCtuyHbSih
— AmuthaBharathi (@CinemaWithAB) July 14, 2025