'లియో'లో విలన్.. రియల్ లైఫ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్.. ఇతడిని గుర్తుపట్టారా? | Leo Movie Villain Choreographer Sandy Master Role Interesting Details- Sakshi
Sakshi News home page

Leo Movie: 'లియో'లో క్రూరమైన విలన్‌గా చేసిన ఇతడెవరో తెలుసా?

Published Fri, Oct 20 2023 7:58 PM

Leo Movie Choreographer Sandy Master Role Details - Sakshi

మీలో చాలామంది 'లియో' సినిమా చూశారు కదా! ఎలా అనిపించింది? అని అడగ్గానే కొందరు నచ్చిందని చెప్తారు. మరికొందరికి నచ్చలేదని అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడవన్నీ ఇక్కడ డిస్కషన్ ఏం పెట్టడం లేదు గానీ మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. 'లియో' ప్రారంభం సన్నివేశాల్లో సైకో కిల్లర్‌గా ఓ కుర్రాడు చేశాడు. ఉన్నంతలో తన యాక్టింగ్‌తో భయపెట్టేశాడు. చెప్పాలంటే వణికించేశాడు. ఇంతకీ అతడెవరో తెలుసా?

'లియో' సినిమాలో యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోపు ఉన్నాయి. మిగతా విషయాల్లో మాత్రం ప్రేక్షకుల్ని అంచనాల్ని అందుకోవడంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫెయిలయ్యాడని చెప్పొచ్చు. అయితే సినిమా ఫస్టాప్ ఓ రేంజులో ఉంటుంది. యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజులో వర్కౌట్ అయ్యాయి. ఇక మూవీ మొదట్లో కనిపించేది కాసేపే అయినా సైకో కిల్లర్ పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది. అది చేసింది స్టార్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్)

తమిళంలో కొరియోగ్రాఫర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్న శాండీ మాస్టర్.. కొన్ని సినిమాల్లో కామెడీ తరహా రోల్స్ చేశాడు. కానీ 'లియో'లో మాత్రం సైకో కిల్లర్ పాత్రలో వణికించేశాడు. హీరోతో తలపడే సీన్‌లో 'చాక్లెట్ కాఫీ' అని రచ్చ లేపాడు. 2005లో 'మానాడా మయిలాడా' అనే డ్యాన్స్ షోతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. అదే షో హోస్ట్ చేసిన కాలా మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. 

2014లో 'ఆహ్' సినిమాతో కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏడాదే 'ఇవనుక్కు తన్నిళ్ల గండం' అనే మూవీతో నటుడు కూడా అయిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఓ 20కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాడు. రజనీకాంత్, విశాల్ తదితర సినిమాలకు పనిచేశాడు. ఇక 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో భాగంగా శాండీ మాస్టర్ చేసిన స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇప్పటికీ అలరిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడు ఎంటర్‌టైన్ చేసే ఇతడు.. ఇలా క్రూరమైన విలన్‌గా కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్‌హిట్ దెయ్యం సినిమా)

Advertisement
 
Advertisement