Liger Movie: డబ్బింగ్ పూర్తి చేసిన బాక్సింగ్ లెజెండ్

ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది.
ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసిన మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. డబ్బింగ్ డన్ అంటూ ‘‘నా పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుణ్ణి’’ అని టైసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘లైగర్’ రిలీజ్ కానుంది.
The final bell has rung!🔔
The legend @MikeTyson has completed his dubbing for #Liger.#VaatLagaDenge pic.twitter.com/LTG9tOHVCV— Dharma Productions (@DharmaMovies) April 1, 2022
చదవండి: నువ్ ఏడ్చే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్