Mike Tyson Birthday-Liger Team: మైక్ టైసన్ బర్త్‌డే, ఆసక్తికర సీన్స్‌తో లైగర్ టీం స్పెషల్ వీడియో రిలీజ్

ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం, లెజెండరి ఆటగాడు మైక్ టైసన్ లైగర్ మూవీతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన చిత్రంలో ఆయన ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే నేడు మైక్ టైసన్ బర్త్‌డే సందర్భంగా లైగర్ టీం ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. గురువారం(జూన్ 30)మైక్ టైసన్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో లైగర్ టీం ఒక్కొరుగా ఆయనకు బర్త్‌డే విషెస్ చేబుతున్న వీడియోను తాజాగా పూరీ కనెక్ట్స్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
చదవండి: టాలీవుడ్‌లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?
ఇందులో నిర్మాత కరణ్ జోహార్, హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మి కౌర్, ఇతర నటీనటులతో పాటు చివరగా పూరీ జగన్నాథ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా మిమ్మల్ని చూసి గర్విస్తుంది మైక్ టైసన్, హ్యాపీ బర్త్‌డే అంటూ కరణ్ ఆయనను కొడియాడాడు. ఈ వీడియోలో టైసన్‌కు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా సెట్స్‌లో ఆయన సందడి చేసిన కొన్ని ఆసక్తికర సీన్స్‌తో ఈ వీడియోను మలిచింది చిత్రం బృందం. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రేక్షకులను, మైక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో లైగర్ థియేటర్లలో అలరించనుంది.
చదవండి: ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్
Team #LIGER Wishes the LEGEND,
The One & Only @MikeTyson a very Happiest Birthday!Await to witness the BIG CLASH on the Big Screens 👊🏾 https://t.co/3KLUcGxbFc@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18#LigerOnAug25th pic.twitter.com/03dY12k0v3
— Puri Connects (@PuriConnects) June 30, 2022