
అథర్వా మురళి హీరోగా నటించిన చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ సతీమణి లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా, అశ్విన్ కాకుమాను విలన్ గా నటించారు.
లచ్చురామ్ ప్రొడక్షన్‌పై ఎ. రాజు నాయక్ ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు. ‘‘యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు అథర్వ. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను ఆయన ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: శక్తి శరవణన్.