
ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై దూసుకుపోతున్న కథానాయికగా కృతి శెట్టి. తొలి సినిమా 'ఉప్పెన'తోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. కెరియర్ ఆరంభంలోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ప్రస్తుతం కృతి శెట్టి నటించిన మరో మూడు సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
చదవండి: ‘సలాం రాఖీ భాయ్’ అంటూ యశ్ కూతురు ఎంత క్యూట్‌గా పాడిందో చూశారా?
అవి సుధీర్ బాబు సరసన చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్ సరసన కథానాయికగా చేసిన 'ది వారియర్' ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించింది కృతి శెట్టి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇంతవరకూ నేను చేసిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివే. అలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం వల్లనే ఆడియన్స్ నన్ను ఆదరించారు. తెరపై 'రాకుమారి'గా కనిపించాలనేది నా డ్రీమ్ రోల్. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.