అప్పుడేమో త్రిషపై వివాదాస్పద కామెంట్స్‌.. ఇప్పుడేమో ఇలా..! | Kollywood actor Mansoor ali Khan support To TVK Vijay | Sakshi
Sakshi News home page

Mansoor Ali Khan: త్రిషపై వివాదాస్పద కామెంట్స్‌.. ఇప్పుడేమో విజయ్‌నే అంటూ..!

May 8 2026 4:38 PM | Updated on May 8 2026 6:43 PM

Kollywood actor Mansoor ali Khan support To TVK Vijay

కోలీవుడ్ నటుడు మ‍న్సూర్ అలీ ఖాన్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నోటిదూలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. గతంలో త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చాలా సినిమాల్లో విలన్‌ పాత్రలు చేసిన మన్సూర్ ఎక్కువగా రేప్ సీన్స్‌లో నటించానని తెలిపారు. విడయ్ హీరోగా వచ్చిన లియో మూవీలో త్రిషతోను అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నానని వివాదాస్పద కామెంట్స్ చేశారు. 

ఈ కామెంట్స్‌ పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. చిరంజీవి, ఖుష్బూతో సహా పలువురు సినీతారలు త్రిషకు మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఈ వివాదంపై మన్సూర్‌ కోర్టుకు వెళ్లారు. త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. అక్కడి అతనికే కోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయలు జరిమానా కట్టాలంటూ పిటిషన్‌ కొట్టవేసింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. త్రిషను  మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే ఎలక్షన్ టైమ్‌లో విజయ్‌కు మద్దతుగా మన్సూర్‌ నిలిచారు. తొక్కిసలాట టైమ్‌లో విజయ్‌ను వెనకొసుకొచ్చారు. ఇప్పుడు విజయ్ గెలిచాక మన్సూర్ స్పందించారు. వెంటనే విజయ్‌ను ఆహ్వానించి సీఎం చేయాలని గవర్నర్‌ను కోరారు. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయవద్దని విజయ్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించకండి.. రాష్ట్రంలో ఏదీ సక్రమంగా పనిచేయడం లేదు. వెంటనే విజయ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టండని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. అప్పుడు త్రిషపై వ్యాఖ్యలతో వివాదానికి కారణమైన మన్సూర్.. ఇప్పుడు విజయ్‌కు మద్దతుగా నిలవడం విశేషం. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement