బర్త్‌డే గిఫ్ట్‌ | kgf 2 teaser release date fix | Sakshi
Sakshi News home page

బర్త్‌డే గిఫ్ట్‌

Dec 3 2020 6:23 AM | Updated on Dec 3 2020 6:23 AM

kgf 2 teaser release date fix - Sakshi

యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్‌ ఇండియన్‌ చిత్రం ‘కేజీయఫ్‌’. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. యశ్‌కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌’ రెండో భాగం మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్‌ ఎప్పుడు వస్తుంది? రాకీ భాయ్‌ (సినిమాలో యశ్‌ పాత్ర) ఏం చేశాడు? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘కేజీయఫ్‌ 2’ టీజర్‌కి డేట్‌ ఫిక్స్‌ అయిందట. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారట. జనవరి 8 యశ్‌ పుట్టినరోజు. బర్త్‌డే స్పెషల్‌గా ఈ టీజర్‌ను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement