‘బెదురులంక’లో ‘డీజే టిల్లు’ బ్యూటీ.. కార్తికేయ కొత్త మూవీ టైటిల్‌ | Kartikeya Gummakonda Latest New Movie Title As Bedurulanka 2012 | Sakshi
Sakshi News home page

‘బెదురులంక’లో ‘డీజే టిల్లు’ బ్యూటీ.. కార్తికేయ కొత్త మూవీ టైటిల్‌

Published Wed, Sep 21 2022 4:03 PM | Last Updated on Wed, Sep 21 2022 4:12 PM

Kartikeya Gummakonda Latest New Movie Title As Bedurulanka 2012 - Sakshi

యంగ్‌ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్‌ నేహా శెట్టి జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్లాక్స్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. నేడు(సెప్టెంబర్‌ 21) కార్తికేయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈ చిత్రానికి 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు చేశారు.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో  చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. 'స్వర్గీయ' సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు" అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ..‘డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి’అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement