Kangana Ranaut Warning Board In Front Of Her Home - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: హద్దు మీరితే కాల్పులు తప్పవు.. బెదిరిస్తోన్న హీరోయిన్‌

Mar 20 2023 9:33 AM | Updated on Mar 20 2023 10:06 AM

Kangana Ranaut Warning Board in front of Her Home - Sakshi

సంచలనాలకు కేంద్ర బిందువు నటి కంగనా రనౌత్‌ అని పేర్కొనవచ్చు. వివాదాలు ఈమెను వెతుక్కుంటూ వస్తాయా లేక ఈమెనే వివాదాలకు కారణం అవుతారా..? అనేది చెప్పడం కష్టం. ఏదేమైనా వివాదాస్పద నటిగా ముద్ర వేసుకున్న కంగనా రనౌత్‌ రూటే సపరేటు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ సుపరిచితురాలైన కంగనా తమిళంలో చాలా కాలం క్రితం దామ్‌ ధూమ్‌ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఈ మధ్య దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా రూపొందిన తలైవి చిత్రంలో టైటిల్‌ పాత్ర పోషించారు. తాజాగా చంద్రముఖి– 2 చిత్రంతో మరోసారి తమిళ తెరపైకి రానున్నారు.

ఇప్పటికే ఈ చిత్రంలో తన నటనకు సంబంధించిన షూటింగును పూర్తి చేశారు. కాగా కంగనా రనౌత్‌ ఇతర నటీమణులకు భిన్నం అనడానికి తాజా సంఘటన మరో ఉదాహరణ. సాధారణంగా ఇళ్ల గేట్ల ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అనే బోర్డులు పెడుతుంటారు. అయితే ఇదేవిధంగా తన ఇంటి ముందు బోర్డు పెడితే ఆమె కంగనా రనౌత్‌ ఎలా అవుతారు? ముంబైలోని తన ఇంటి ముందు గోడపై హద్దు మీరొద్దు.. మీరితే కాల్చబడతారు.. అయినా ప్రాణాలతో బయటపడితే మళ్లీ కాల్చబడతారు అనే బోర్డును పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అది చూసిన పలువురు హద్దు మీరొద్దు అంటూ మరి ఇంత భయపెట్టే విధంగా బోర్డు పెట్టడం కరెక్టా అంటూ చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement