Kangana Ranaut: అజయ్‌, అక్షయ్‌ నా సినిమాలను ప్రమోట్ చేయరు: కంగనా రనౌత్

Kangana Ranaut Shocking Comments On Akshay Kumar Ajay Devgn - Sakshi

Kangana Ranaut Shocking Comments On Akshay Kumar Ajay Devgn: బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్‌'. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్‌ దేవగణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే బాలీవుడ్‌పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ తనకు సపోర్ట్ చేయదని ఎప్పటినుంచో చెప్పుకొస్తుంది కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్. 

తాజాగా 'అజయ్‌ దేవగణ్‌ నా సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయడు. కానీ ఇతర చిత్రాలను ప్రమోట్‌ చేస్తాడు. ఇక అక్షయ్‌ కుమార్‌ నాకు కాల్‌ చేసి తలైవి సినిమా బాగుందని చెబుతాడు. కానీ ఆ మూవీ ట్రైలర్‌ను షేర్‌ చేయడం, ట్వీట్‌ చేయడం మాత్రం చేయడు. కాబట్టి వారి గురించి నేను ఏం మాట్లాడలేను. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ నా సాంగ్ టీజరన్‌ను ట్వీట్‌ చేసి వెంటనే దాన్ని తొలగించారు. ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడను. అజయ్ దేవగణ్‌ ఇతరులు చేసిన మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు. కానీ చిత్రాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్‌ చేసిన అర్జున్‌ రాంపాల్‌పై ఎలా కృతజ్ఞతతో ఉంటానో, నా సినిమాలో అజయ్‌ దేవగణ్‌ నటించిన అలాగే గొప్పగా ఫీల్‌ అవుతా.' అని తెలిపింది కంగనా రనౌత్‌. 

ఇతరుల సినిమాలను ప్రమోట్‌ చేయడంపై కంగనా రనౌత్ మాట్లాడుతూ 'నేను ఇతరుల సినిమాలను సపోర్ట్ చేసినట్లుగానే నా సినిమాలు ఇతరులు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటాను. ది కశ్మీర్‌ ఫైల్స్‌, షేర్షా వంటి చిత్రాలను అభినందించడానికి, ప్రమోట్ చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటాను. నేను సిద్ధార్థ మల్హోత్రా గురించి, కరణ్‌ జోహార్‌ చిత్రాలను కూడా మెచ్చుకున్నాను. నేను ప్రశంసించాలనుకుంటే బహిరంగానే చేస్తాను. ఎవరికీ తెలియకుండా కాల్‌ చేసి చెప్పను. ఈ పరిస్థితి మారి నాలాగే వారు కూడా భవిష్యత్తులో నా సినిమాలపై స్పందిస్తారని అనుకుంటున్నా.' అని తెలిపింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top