Kamal Haasan Sensational Comments On The Kerala Story Movie - Sakshi
Sakshi News home page

Kamal Haasan: ది కేరళ స్టోరీపై కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు

May 29 2023 7:11 AM | Updated on May 29 2023 8:41 AM

Kamal Haasan Sensational Comments on The Kerala Story - Sakshi

యధార్థ కథ అంటూ ఏదో ఒక అంశాన్ని చెబితే అది నిజం అవదన్నారు. వాస్తవంగా అది యదార్థ కథ అయి ఉం

ది కేరళ స్టోరి చిత్రంపై ఇప్పటికే పలు రకాల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కేరళలో ఓ వర్గానికి చెందిన యువతుల మతం మార్చి ఆ తరువాత ఉగ్రవాదులుగా తయారు చేసే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఇది. ఇది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమని యూనిట్‌ వర్గాలు ప్రచారం చేశాయి. ఇదే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడానికి ప్రధాన కారణం.

దీంతో కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. తమిళనాడు థియేటర్ల యాజమాన్యం కూడా ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన రద్దు చేశాయి. అయితే బీజేపీ అధికార ప్రభుత్వాలు మాత్రం ఈ చిత్రానికి వినోదపు పన్నును రద్దు చేశాయి. ఇక సుప్రీంకోర్టు కూడా ది కేరళ స్టోరీ చిత్రంపై నిషేధాన్ని కొట్టివేసింది. ఇలాంటి రగడ మధ్య ఈ చిత్రం సుమారు రూ.200 కోట్లు వసూలు చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో విశ్వనటుడు కమల్‌ హాసన్‌ తాజాగా ది కేరళ స్టోరీ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక భేటీలో తాను పబ్లిసిటీ చిత్రాలకు వ్యతిరేకినని అన్నారు. యధార్థ కథ అంటూ ఏదో ఒక అంశాన్ని చెబితే అది నిజం అవదన్నారు. వాస్తవంగా అది యదార్థ కథ అయి ఉండాలన్నారు. అయితే ది కేరళ స్టోరీ చిత్రంలో చూపించిన సన్నివేశాలు నిజం కాదని కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు.

చదవండి: నటుడికి చేదు అనుభవం.. భార్యతో అసభ్యంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement