Kamal Haasan: అంధుడిగా నటించనున్న కమల్ హాసన్!

ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలరు కమల్ హాసన్. 1981లో వచ్చిన ‘రాజపార్వై’ చిత్రంలో అంధుడిగా నటించి, ప్రేక్షకులను మెప్పించారాయన. దాదాపు 30 యేళ్ల తర్వాత మళ్లీ ఆయన అంధుడి పాత్రలో నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘విక్రమ్’ చిత్రంలోనే ఆయన ఈ పాత్ర చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. అయితే సినిమాలో సగభాగం వరకు అంధుడుగా కనిపిస్తారని భోగట్టా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారని తెలిసిందే.