
ప్రభాస్ మూవీ 'కల్కి 2' షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది అంటూ సోషల్మీడియలో పలు ప్రశ్నలు కనిపిస్తూనే ఉన్నాయి. కల్కి 2898 AD సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అందుకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. మూవీ షూటింగ్, విడుదల ఎప్పుడు ఉండొచ్చు అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు.
‘కల్కి 2’ షూటింగ్ ఎప్పుడనేదానిపై నాగ్ అశ్విన్ ఇలా చెప్పారు.. '2025 చివరి నాటికి కల్కి 2 చిత్రీకరణ ప్రారంభించాలని ప్లాన్ సిద్ధం చేశాం. అయితే, దానికి చాలా అంశాలు కలిసిరావాలి. ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్న నటీనటులు చాలా బిజీగా ఉన్నారు. ఆపై ఈ సినిమాలో ఎక్కువగా విజువల్ వండర్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నాయి.. ఆపై భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది. ఇదే ఏడాదిలో ప్రారంభం అవుతుందని కూడ ఖచ్చితంగా చెప్పలేను. ఇందులో నటించే ముఖ్యమైన వారందరూ చాలా బిజీగా ఉన్నారు.' అని ఆయన అన్నారు.
షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు కొంత సమయం పడుతుందని, ఆపై పోస్ట్ ప్రొడక్షన్కు సాధారణంగా ఎక్కువ సమయం పడుతుందని నాగ్ అశ్విన్ అన్నారు. ఇంకో 2 లేదా 3 సంవత్సరాలలో పెద్ద స్క్రీన్పై ఈ సినిమాను చూడొచ్చన్నారు. అంటే 2028లో కల్కి2 చూడొచ్చని ఒక అంచనాతో అభిమానులు ఎదురుచూడాల్సిందే. ఖచ్చితంగా కాస్త ఎక్కువ సమయమే పడుతుందని నాగ్ అశ్విన్ ఒక క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్‌రెడ్డి వంగా 'స్పిరిట్' త్వరలోనే ప్రారంభించాలనే ప్లాన్లో ఉన్నారు. వెనువెంటనే ప్రశాంత్ నీల్‌తో ‘సలార్2: శౌర్యంగ పర్వం’ ఉంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. అయితే, మొదట స్పిరిట్ మూవీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ ఎక్కువ డేట్స్ సందీప్ రెడ్డికే ఇచ్చినట్లు సమాచరం.