Jr NTR Special Guest For Brahmastra Pre Release Event - Sakshi
Sakshi News home page

Jr NTR: బ్రహ్మాస్త్ర గ్రాండ్‌ ఈవెంట్‌: ముఖ్య అతిథిగా యంగ్‌ టైగర్‌

Aug 27 2022 4:51 PM | Updated on Aug 27 2022 5:21 PM

Jr NTR Special Guest For Brahmastra Pre Release Event - Sakshi

రణ్‌బీర్‌తో పాటు ఆలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్‌ వేడుక జరుపనున్నారు.

రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన షంషేరా బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా చతికిలపడింది. దీంతో తన తర్వాతి సినిమా బ్రహ్మాస్త్ర మీదే బోలెడాశలు పెట్టుకున్నాడీ హీరో. రణ్‌బీర్‌తో పాటు ఆలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అయాన్‌ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం 'బ్రహాస్త్ర: మొదటి భాగం శివ' పేరిట సెప్టెంబర్‌ 9న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌కు రెడీ అవుతోంది చిత్రయూనిట్‌. అందులో భాగంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఖరారు చేశారు. సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్‌ వేడుక జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రహాస్త్ర చిత్రయూనిట్‌ ఓ స్పెషల్‌ మీడియాను రిలీజ్‌ చేసింది.

చదవండి: ఆంటీ లొల్లి.. అనసూయకు సపోర్ట్‌ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్‌
బిగ్‌బాస్‌ పింకీ పెళ్లి? యాంకర్‌ రవి ఏమన్నాడంటే?

Advertisement
 
Advertisement
Advertisement