Jr NTR Predicted As Best Actor Contender For Oscar 2023 By US Magazine - Sakshi
Sakshi News home page

Jr Ntr : ఆస్కార్‌ రేసులో ఎన్టీఆర్‌.. జాబితాను వెల్లడించిన ప్రముఖ మ్యాగజైన్‌

Jan 21 2023 3:32 PM | Updated on Jan 21 2023 3:59 PM

Jr Ntr Predicted As Best Actor Contender For Oscar 2023 By Us Magazine - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటనను మెచ్చుకోని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. యాక్షన్‌ సీన్స్‌లోనే కాకుండే ఎమోషనల్‌ పరంగానూ తారక్‌ నటన కంటతడి పెట్టింటింది. ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో తారక్‌ నిలుస్తారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.  ఈ ఏడాది టాప్‌-10 బెస్ట్‌ యాక్టర్స్‌ ప్రిడిక్షన్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కడం విశేషం. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు కూడా టాప్‌-10 లిస్ట్‌లో ఉన్నాయి.

ఇక ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్‌ నామినేషన్స్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఏదో ఒక విభాగంలో అయినా ఆస్కార్‌ దక్కుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి కొమురం భీమ్‌ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ వరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement