Buzz: Asura Or Asurudu Title Fixed For Jr NTR And Prashanth Neel Movie, Goes Viral - Sakshi
Sakshi News home page

Jr NTR Prashanth Neel Movie Title: ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ సినిమా టైటిల్‌ ఇదేనా ?

Jun 4 2022 8:37 AM | Updated on Jun 4 2022 11:42 AM

Is Jr NTR Prashanth Neel Movie Title As Asura Or Asurudu - Sakshi

Is Jr NTR Prashanth Neel Movie Title As Asura Or Asurudu: ‘అసుర అసుర అసుర అసుర.. రావణాసుర..’ అంటూ ‘జై లవ కుశ’ చిత్రంలోని ఓ పాటలో ఎన్టీఆర్‌ తన వీరత్వాన్ని చూపిస్తారు. కాగా ఇప్పుడు ‘అసుర’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్‌ బర్త్‌ డే (మే 20) సందర్భంగా రెండు భారీ సినిమాల ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.  వాటిలో ఒకటి కొరటాల శివతో (ఎన్టీఆర్‌ 30వ చిత్రం) కాగా, మరొకటి ప్రశాంత్‌ నీల్‌తో. ముందుగా ఎన్టీఆర్‌–కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ సినిమా సెట్స్‌కి వెళుతుందని టాక్‌. ఈ చిత్రానికి ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్‌. మరి.. ‘అసుర’ లేదా ‘అసురుడు’ టైటిల్స్‌లో ఏదో ఒకటి ఫిక్స్‌ చేస్తారా? లేకుంటే మరో కొత్త టైటిల్‌ ఉంటుందా? అనేది తెలియాలంటే వేచి చూడాలి.

చదవండి:  హీరోతో నాలుగోసారి సినిమా చేస్తున్న సమంత ! 
టాలీవుడ్‌లో ఎన్టీఆర్, సమంత టాప్‌..


Advertisement
 
Advertisement
Advertisement