నీ వల్లే అబార్షన్‌.. అంటూ అభిని నిందించిన అంకిత

Intinti Gruhalakshmi June 17: Tulasi Slaps Abhi - Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 348వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

ఇంటింటి గృహలక్ష్మి జూన్‌ 17వ ఎపిసోడ్‌: ఇంట్లోకి మనుమడో, మనుమరాలో వస్తారని సంతోషపడ్డ నందు, తులసి.. అంకిత అబార్షన్‌ చేయించుకున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అభికి తెలీకుండా అలా ఎలా అబార్షన్‌ చేసుకుంటుంది? పాపం, నా కొడుకు ఎంత కుమిలిపోతున్నాడో? అని నందు తల్లడిల్లిపోయాడు. నందు కుటుంబం గురించి ఆలోచించడం చూసి లాస్య లోలోపలే ఉడుక్కుంది. 

మరోవైపు అభి, అంకిత బంధానికి బీటలు వారనున్నట్లు కనిపిస్తోంది. మనిద్దరి రక్తం కలిసి ప్రాణం పోసుకున్న బిడ్డను చంపేశావు, ఇంకా ఏం చేద్దామని నా దగ్గరికి వస్తున్నావ్‌ అని అభి తన భార్యను చీదరించుకున్నాడు అభి. నా ఆశలను ఆవిరి చేశావంటూ ఆగ్రహించాడు. నువ్వు చంపింది నీ కడుపులో ఉన్న బిడ్డను కాదు, మన ప్రేమను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పిచ్చి పని ఎందుకు చేశావని నిలదీశాడు.

దీంతో అంకిత నీవల్లే అబార్షన్‌ చేయించుకున్నానని చెప్తూ బాంబు పేల్చింది. ఇప్పటివరకు మనం సెటిల్‌ కాలేదని, నువ్వు బిడ్డను పోషించలేవనే గర్భాన్ని తీయించేసుకున్నానని అభికి సూటిగా చెప్పింది. ఇప్పటికే నువ్వు చేతకానివాడిలా మిగిలిపోయావని నిందించింది. పైసా సంపాదించడం చేతకాదని సూటిపోటి మాటలతో అతడి మనసును ఛిద్రం చేసింది. దీంతో తను జీవితంలో ఫెయిల్‌ అయ్యానని రోదించాడు అభి.

అటువైపేమో అభి పరిస్థితిని తలుచుకుని తులసి తల్లడిల్లిపోయింది. అతడి ఆశలు అడియాసలయ్యానని దిగులు చెందింది. ఆ ఇంట్లో అందరూ ఉన్నా అభి అనాధలా బతుకుతున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమించిన అమ్మాయే వాడిని మోసం చేసిందని దుఃఖించింది. నిత్యం కుమిలిపోతూ ఉండే జీవితం వాడికొద్దని సంతోషకరమైన జీవితాన్ని అందించాలని తులసి ఆశపడుతోంది. రేపటి ఎపిసోడ్‌లో అభి అత్తింటిని వదిలి తిరిగి తల్లి దగ్గరకు వచ్చేశాడు. ఆ ఇంటినే కాదు అంకితను కూడా వదిలేశానని చెప్పడంతో తులసి చెంప పగలగొట్టింది. మీ నాన్నను చూసి నేర్చుకుంటున్నావా? అని కోప్పడింది. మరి అభిని తులసి ఇంట్లోకి రానిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!

చదవండి: Sai Pallavi : బాలీవుడ్‌ ఆఫర్‌ని రిజెక్ట్‌ చేసిన సాయి పల్లవి.. కారణం ఇదేనట

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top