Sonu Sood: నేనూ సోనూసూద్‌ అవుతా

I Want To Became Sonu Sood Says Kid - Sakshi

కష్టకాలంలో తనకు తోచినంత సాయం చేయడం మనిషి ధర్మం. కానీ, తన పరిధి దాటి సాయం చేయాలనుకోవడం సోనుసూద్‌ లాంటి వాళ్లకు మాత్రమే సాధ్యమేమో!. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను తరలించడం నుంచి మొదలైన సోనూ సాయం.. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌లు నెలకొల్పేదాకా చేరుకుంది. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లకు తక్షణ సాయం అందేలా ప్రయత్నిస్తూ.. కోట్ల మందితో జేజేలు అందుకుంటున్నాడు సోనూసూద్‌.

అలాంటి రియల్‌ హీరోను స్ఫూర్తిగా తీసుకుంటానంటోంది ఓ తెలుగు చిన్నారి. పెద్దయ్యాక ఏ ఇంజినీరో డాక్టరో కాకుండా.. సోనూసూద్‌లా అవుతానని, నలుగురికి అతనిలా మంచి చేస్తానని చెబుతోంది. ఆ వీడియోను ఆ చిన్నారి అమ్మ ప్రశాంతి ముప్ప తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి.. సోనూకి ట్యాగ్‌ చేసింది. వీలున్నప్పుడు తన కూతురికి కలిసే అవకాశం ఇవ్వాలని సోనూసూద్‌కి రిక్వెస్ట్‌ చేసింది. ఆ చిన్నారి మాటలకు మురిసిపోయిన సోనూ ‘ఆమె ఒక స్టార్‌’ అంటూ బదులిచ్చాడు.

నిస్సహాయుడినయ్యా..
ఒకరిని కాపాడే ప్రయత్నంలో మీరు విఫలమయ్యారంటే.. మిమ్మల్ని మీరు పొగొట్టుకున్నట్లే. ఒకరి ప్రాణాల్ని నిలబెడతానని ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేనప్పుడు.. వాళ్ల కుటుంబాన్ని ఎదుర్కొవడం కష్టమే. ఈరోజు కొందరిని కాపాడలేకపోయా. రోజూ పదిసార్లు వాళ్లతో పదిసార్లు మాట్లాడుతున్న. ఇక వాళ్లకూ దూరమైనట్లే. నిస్సహాయుడిగా ఫీలవుతున్నా అంటూ సోనూ ఎమోషనల్‌గా ట్విట్టర్‌లోఓ పోస్ట్‌ చేశాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top