
‘సమయమా... భలే సాయం చేశావమ్మా ఒట్టుగా... కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా..’ అని పాడుకున్నారు నాని.. ‘సరే సరే.. త్వరపడకో.. తదుపరి కథ ఎటుకో..’ అని పాడారు మృణాల్ ఠాకూర్. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న ‘హాయ్ నాన్న’ చిత్రంలోని తొలి పాట ఇది.
చిత్ర సంగీతదర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. శనివారం ఈ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర ΄ోషిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు.