థ్రిల్‌కి గురి చేసే మీరా | Hello Meera is a one and half hour adventure film | Sakshi
Sakshi News home page

థ్రిల్‌కి గురి చేసే మీరా

Apr 19 2023 4:05 AM | Updated on Apr 19 2023 4:05 AM

Hello Meera is a one and half hour adventure film - Sakshi

ప్రముఖ దర్శకులు బాపు వద్ద అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేసిన కాకర్ల శ్రీనివాస్‌ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘హలో మీరా’. గార్గేయి యాల్లాప్రగడ లీడ్‌ రోల్‌ చేశారు. జీవన్‌ సమర్పణలో డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. కాకర్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఒకే ఒక్క పాత్రతో రూపొందిన చిత్రం ‘హలో మీరా’.

వైవిధ్యభరితమైన కథలో వచ్చే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. తెరపై కనిపించేది మీరా (గార్గేయి పాత్ర పేరు) అయినా వినిపించే పాత్రలన్నీ సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలేలా ఉంటాయి. ప్రేమ, స్నేహం, స్నేహితుల కోసం దెబ్బలు తినడం, రౌడీయిజమ్, బ్రేకింగ్‌ న్యూస్‌ వంటి అన్ని అంశాలు ప్రేక్షకుడి కళ్ల ముందు ఉండేలా జాగ్రత్త పడ్డాం. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement